Raju Weds Rambai | చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి సాయిలు కంపటి దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా మంగళవారం చిత్రబృందం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. అయితే ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు బాబీ కొల్లి దర్శకుడికి బంపరాఫర్‌ని ప్రకటించాడు. ఈ సినిమా చూసి ఫిదా అయిన బాబీ తన రాబోయే చిత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సాయిలు కంపాటికి ఒక రోల్‌ని ఆఫర్ చేశాడు. మెగాస్టార్ సినిమాలో రోల్ ఆఫర్ రావడంతో ఆనందంతో ఒకే చెప్పాడు సాయిలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Director Bobby offers a CHANCE to both the DIRECTOR and the song LYRICIST of #RajuWedsRambai for his film with the MEGA STAR #Chiranjeevi! pic.twitter.com/M7QsmiigDS
— Movies4u Official (@Movies4u_Officl) November 25, 2025