విష్ణు బొప్పన సారథ్యంలోని వీబీ ఎంటర్టైన్మెంట్స్ పదో వార్షికోత్సవం సందర్భంగా 2023-24 సంవత్సరానికిగాను బుల్లితెర అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, అంబికా కృష్ణ, జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో సీనియర్ నటి లక్ష్మీకి జీవన సాఫల్య పురస్కారం అందించారు. పలువురు టీవీ ఆర్టిస్ట్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్కు కూడా అవార్డులను అందించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ మాట్లాడుతూ ‘ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా గురువుగారు దివంగత జంధ్యాల గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు’ అని అన్నారు.