Bulli Raju| కొద్ది రోజుల క్రితం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల బుల్లితెరపై సందడి చేసిన ఈ మూవీకి మంచి టీఆర్పీ కూడా వచ్చింది. ఇందుల ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలతో అదరగొట్టేశారు. అయితే సినిమాలో వెంకటేష్ కుమారుడిగా నటిచిన బుల్లిరాజు తన నటన, డిక్షన్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన రోజు నుండి బుల్లిరాజుపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అతనే సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారాడు. బుల్లిరాజుతో చాలా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
సంక్రాంతికి వస్తున్న చిత్రం మాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు కుటుంబ కథా చిత్రంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో బుల్లిరాజు బూతులు తిడుతూ తెగ నవ్విస్తుంటారు. అయితే బుల్లిరాజు అలా బూతులు తిట్టడానికి కారణం ఓటీటీలు చూసి చెడిపోవడమే అని వెంకీ చిత్రంలో చెప్పుకొస్తాడు. ఏది ఏమైన తొలి సినిమాతో బుల్లిరాజుకి మంచి పేరు రావడంతో పాటు డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. దీంతో సీనియర్ స్టార్స్ రేంజ్లో బుల్లి రాజు తన రెమ్యునరేషన్ పెంచినట్టు టాక్ వినిపిస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, బుల్లి రాజు ఒక రోజుకు ఏకంగా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
గతంలో ఎప్పుడు కూడా చిన్న పిల్లలకి ఇంత రెమ్యునరేషన్ ఇచ్చింది లేదు. కాని సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అతని పర్ఫార్మెన్స్కి మెచ్చి నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో ఆఫర్ అందిపుచ్చుకుంటున్నాడు బుల్లిరాజు.అతను నెలలో పది రోజులు కాల్షీట్స్ ఇచ్చాడంటే 10 లక్షలు. నేటితరం సీనియర్ ఆర్టిస్టులు కొందరు ఇదే రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో, బుల్లి రాజు కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో కూడా బుల్లిరాజు పాత్ర పేలింది అంటే మనోడికి ఇక తిరుగు ఉండదు అని చెప్పాలి