రవివర్మ, సంజనా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్’. చౌడప్ప దర్శకత్వంలో తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు ఊడ్చి చెత్త ఎత్తివేయడం కాదు దేశానికి పట్టిన చీడ పురుగులని ఏరేసే ప్రయత్నమే లక్ష్యమని, బుద్ధుడు కూడా రుద్రుడౌతాడని.. బుద్ధం శరణ గచ్చామి కాదు యుద్ధం శరణం గచ్చామి అని చాటి చెప్పే సినిమా అవుతుంది. సమాజానికి ఈ చిత్రం ద్వారా అందిస్తున్న సందేశం అందరిని ఆలోచింపజేస్తుంది’ అన్నారు. అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.