వాటువల్లి అనిల్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘బుక్కా ఫకీర్’. నందిని కథానాయిక. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. కుటుంబసమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇదని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని వాటువల్లి అనిల్ నమ్మకం వ్యక్తం చేశారు. స్వాతి, త్రివేణి, లొంబో, రాజేంద్ర, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌కుమార్, సంగీతం: లలిత్ కిరణ్.