పెళ్లి సందడి నుండి మాసీ ఫోక్ సాంగ్ విడుదల

ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన రాఘవేంద్రరావు చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కస్తున్న సినిమా పెళ్ళిసందడి. గతంలో శ్రీకాంత్ హీరోగా ‘పెళ్ళిసందడి’ అనే సినిమాని తెరకెక్కించిన రాఘవేంద్రరావు ఇప్పుడు ఆయన తనయుడు రోషన్ హీరోగా పెళ్లి సందడి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రాఘేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోనకం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఫైనల్ స్టేజీలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని ఇటీవల విడుదల చేసారు. ‘ప్రేమంటే ఏంటి’ అని సాగే ఈ పాటకు కీరవాణి బాణీలు,లిరిసిస్ట్ చంద్రబోస్ అందమైన పదాలు హిట్టయ్యేలా చేశాయి. ఇక తాజాగా రాఘవేంద్రరావు బర్త్‌డే సందర్భంగా మూవీ నుండి మాసీ ఫోక్ సాంగ్ విడుదల చేశారు. బుజ్జులు బుజ్జులు అంటూ బాబా సెహగల్, మంగ్లీ పాడిన ఈ పాట శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.తాజాగా విడుదలైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు?
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు
రెండు దశాబ్దాల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం
దేశంలో మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు
ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

