Writer Padmabhushan | కలర్‌ఫొటో సినిమాతో హీరోగా సూపర్ బ్రేక్ అందుకున్నాడు సుహాస్ (suhas). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan) చిత్రంలో నటిస్తున్నాడు. షణ్ముఖ ప్రశాంత్ (డెబ్యూ)డైరెక్షన్లో ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో సుహాస్ టీం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
కాగా మూవీ లవర్స్ కోసం టికెట్ రేట్ల అప్డేట్ అందించారు మేకర్స్. ఫ్యామిలీతో వెళ్లాలంటే టికెట్ రేట్లు బడ్జెట్లో ఉండేలా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో (బాల్కనీ) రూ.110, మల్టీప్లెక్స్ లో తెలంగాణలో రూ.150, ఏపీలో రూ.177గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు.
సుహాస్ టీం విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల 27న విజయవాడ నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టింది సుహాస్ టీం. గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్‌లో ప్రమోషనల్ టూర్ కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రంలో వృత్తిపరమైన కష్టాలు ఎదుర్కొనే అప్‌కమింగ్ రైటర్‌గా కనిపించనున్నాడు సుహాస్. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరి ప్రియ ఇతర నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిలిమ్స్ -ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
#WriterPadmabhushan సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన చిత్రం!
Andhuke ee budget friendly ticket pricing 🤗❤️
Lowest ticket prices for a film in recent times.
– https://t.co/F7WzFJ2DytIn cinemas on Feb 3rd!@ActorSuhas @prasanthshanmuk @LahariFilm pic.twitter.com/0KOAjISxyu
— Chai Bisket Films (@ChaiBisketFilms) January 31, 2023
రైటర్ పద్మభూషణ్ ట్రైలర్..