ఉప్పెన సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు యువ దర్శకుడు బుచ్చి బాబుసాన (Buchi Babu Sana). బాక్సాఫీస్ వద్ద వైష్ణవ్‌తేజ్-కృతిశెట్టికి తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందించాడు. కానీ ఇప్పటివరకు రెండో సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ దర్శకుడు నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR )ను డైరెక్ట్ చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తారక్‌కు స్టోరీ నచ్చకపోవడంతో సినిమా కార్యరూపం దాల్చలేదని ఇన్సైడ్ టాక్.
ఇదిలా ఉంటే ఇపుడు మరో గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. బుచ్చి బాబు అదే సబ్జెక్టును విజయ్ దేవరకొండకు కలిసి వినిపించాడని తాజాగా ఓ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను కూడా బుచ్చి బాబు చెప్పిన కథ ఇంప్రెస్ చేయలేకపోవడంతో బుచ్చి బాబు నిరాశలో ఉన్నాడని జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తారక్ కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ 30 సినిమా కోసం రెడీ అవుతున్నాడు.
ఇక ఇటీవలే లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఎలాంటి రిస్క్ చేయకూడదని భావిస్తున్నాడట విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఇంప్రెస్ చేయలేని ఈ కథ రానున్న రోజుల్లో ఏ హీరో దగ్గరకు వెళ్తుంది..ఇంతకీ ఎవరు బుచ్చి బాబు కథలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.
Read also : Rajinikanth | జైలర్ షూటింగ్ స్పాట్లో రజినీకాంత్.. ఫొటోలు, వీడియో వైరల్
Read also : NC 22 Update | NC 22తో కార్తీకదీపం వంటలక్క టాలీవుడ్ ఎంట్రీ.. వివరాలివే
Read also : Mega 154 | క్రేజీ టాక్..మెగా 154లో రవితేజ పాత్ర పేరు ఇదేనట..!
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Mohan Raja | లూసిఫర్‌ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా