BRICS Summit | బ్రిక్స్ సదస్సులో జిన్పింగ్ ప్రసంగం.. ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని సూచన
BRICS Summit : బ్రిక్స్ సదస్సు రెండో రోజైన ఆదివారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఐదు కీలక సూత్రాలపై దృష్టిపెట్టాలని ప్రతిపాదించారు.
BRICS Summit : బ్రిక్స్ సదస్సు రెండో రోజైన ఆదివారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఐదు కీలక సూత్రాలపై దృష్టిపెట్టాలని ప్రతిపాదించారు. ఢిల్లీ, భారత్ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిన్పింగ్ మాట్లాడారు. గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఈ విషయంలో చైనానే బాధ్యత తీసుకుంటుందన్నారు. తమ చర్య ద్వారా ఆయా దేశాల మధ్య ఏఐ అభివృద్ధి, బహుభాషా మోడళ్లకు చెందిన అప్లికేషన్లు ఏర్పాటు చేయడం, ఏఐ సెమినార్లు, శిక్షణ వంటివి నిర్వహిస్తామన్నారు. రెండోది బ్రిక్స్ దేశాల మధ్య స్పెషల్ ఎకనామిక్ జోన్ భాగస్వామ్యం అవసరం అన్నారు. దీని ద్వారా ఆయా దేశాల మధ్య పెట్టుబడులు, వ్యాపరం విషయంలో సహకారం పెరుగుతుందన్నారు. బ్రిక్స్ ఇంటెలిజెంట్ పోర్టల్ ఏర్పాటు చేసుకోవాలని, సహకారానికి పాలసీ రూపొందించాలని సూచించారు.
అలాగే, బ్రిక్స్ దేశాల మధ్య డిజిటల్ ఎకో సిస్టమ్ కోసం క్లౌడ్ ప్లాట్ఫాం ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా డిజిటల్ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డిజిటల్ స్కిల్స్లో శిక్షణ, సాంకేతిక మార్పిడి వంటివి జరగాలన్నారు. కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తగిన ప్రమాణాలు, నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని వివరించారు. తయారీ రంగంలో ఇంటెలిజెన్స్ను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.
చివరగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఈ రంగంలో ఇన్నవేషన్కు చైనా బ్రిక్స్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్కు అనుగుణంగా బ్రిక్స్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రతిపాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

