Mohan Raja | లూసిఫర్‌ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా
అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్, డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja), నటుడు సత్యదేవ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటించిన చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చింది. అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్, డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja), నటుడు సత్యదేవ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
లూసిఫర్ రీమేక్ చేయడం వెనుకున్న ప్రాధాన్యం గురించి డైరెక్టర్ మోహన్ రాజా మాట్లాడుతూ.. లూసిఫర్‌ను అందరూ చూశారు..వీళ్లెందుకు చేస్తున్నారు..వీళ్లకు బుద్దుందా లేదా..? అని కామెంట్లు వస్తుంటే..అవే ఛాలెంజ్‌గా తీసుకొని గాడ్ ఫాదర్ తీశామన్నారు. ఈ సినిమా రావడానికి కారణం సినిమాలోని కోర్ పాయింట్. నేను లూసిఫర్‌ను ఓ కథగా చూడను..ఒక ఐడియాగా చూస్తానన్నాడు.
రజినీకాంత్ భాషా ఎలా అయితే హీరోయిజానికి ట్రేడ్‌మార్క్‌గా నిలిచిందో..? దశాబ్దాల తర్వాత లూసిఫర్ అనేది ఆ హీరోయిజంను ఇంకో స్థాయికి తీసుకెళ్లే ఐడియా. జరిగింది చూపించం..జరుగబోయేది చూపించం. కానీ ఆ హీరో గురించి చెప్తే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి మంచి ఐడియాను చాలా బాగా చూపించవచ్చు. ఆ ఆలోచనకు పొటెన్షియాలిటి ఉందని గుర్తించాం. లూసిఫర్‌ను క్లాస్ యాంగిల్లో చూపించారు. ఆ ఐడియాను ఎన్నో యాంగిల్స్‌లో చూపించవచ్చు. మన ప్రాంతానికి మాస్ యాంగిల్ అయితే తాజాగా చాలా బాగుంటుందనిపించిందన్నాడు మోహన్ రాజా.
లూసిఫర్ చూసి అంచనాలు పెట్టుకునేవారికి గాడ్ ఫాదర్ ఇంకా నచ్చుతుంది. నెక్ట్స్ రాబోయే సీన్ అదే అని అనుకునే వారి అంచనాలకు అందకుండా తెలుగు వెర్షన్ థ్రిల్ అందిస్తుందని అనుకున్నాం. గాడ్ ఫాదర్లో ఎక్కువగా స్క్రీన్ ప్లేనే నమ్మాం. అదే సినిమాను చాలా కాపాడింది. సినిమాకు స్క్రీన్‌ప్లే చాలా ముఖ్యమని గాడ్ ఫాదర్ మరోసారి నిరూపించిందని మోహన్ రాజా చెప్పుకొచ్చాడు.
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Pooja Hegde | పూజాహెగ్డేతో కేక్ కట్ చేయించిన సల్మాన్ ఖాన్, వెంకటేశ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

