Pooja Hegde | పూజాహెగ్డేతో కేక్ కట్ చేయించిన సల్మాన్ ఖాన్, వెంకటేశ్.. ట్రెండింగ్‌లో వీడియో
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది పూజాహెగ్డే (Pooja Hegde). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ 'బుట్టబొమ్మ' నేడు 32వ పుట్టినరోజు (Pooja Hegde birthday) జరుపుకుంటోంది.
ఒక లైలా కోసం, ముకుందా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముంబై భామ పూజాహెగ్డే (Pooja Hegde). తెలుగులో తొలి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ ‘బుట్టబొమ్మ’ నేడు 32వ పుట్టినరోజు (Pooja Hegde birthday) జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా పూజాహెగ్డేకు కోస్టార్లు, అభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సల్లూభాయ్, వెంకీ ఈ మూవీ సెట్స్ లో కోస్టార్ పూజాహెగ్డే పుట్టినరోజు వేడుకలను జరిపారు.

ఈ ఇద్దరు హీరోలు చిత్రయూనిట్ సమక్షంలో పూజాహెగ్డేతో కేక్ కట్ చేయించి ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. పూజాహెగ్డే పుట్టినరోజు వేడుకల ఫొటోలు, వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పూజాహెగ్డే మరోవైపు తెలుగులో మహేశ్‌బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

