శనివారం 28 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 15:31:04

ఆసిన్ రీఎంట్రీ ఇవ్వ‌డం లేద‌ట‌..!

ఆసిన్ రీఎంట్రీ ఇవ్వ‌డం లేద‌ట‌..!

తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుంది అందాల తార ఆసిన్. ప‌లువురు స్టార్ హీరోలతో క‌లిసి న‌టించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇవాళ ఆసిన్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా కోస్టార్లు, అభిమానులు ఆసిన్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అయితే ప్ర‌స్తుతం ఢిల్లీలో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న ఆసిన్ త్వ‌ర‌లో రీఎంట్రీ ఇవ్వ‌నుందని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఓ హిందీ సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మ‌రోసారి మెరువ‌నుంద‌ని టాక్ వినిపించింది.

అయితే అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని ఆసిన్ స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతానికి ఆసిన్ సినిమాలు చేసే ఉద్దేశంతో లేద‌ని పేర్కొన‌ట్టు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. ఆసిన్ 2016లో రాహుల్ శ‌ర్మ‌ను పెళ్లి చేసుకోగా మూడేళ్ల కూతురుంది.  లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.