రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఛత్రపతి. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం 2005లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో ప్రభాస్ డైలాగ్స్, ఆయన పర్ఫార్మెన్స్కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. 16 ఏళ్ల తర్వాత ఛత్రపతి చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు యువహీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హిందీ చలనచిత్ర సీమలో అడుగుపెడుతున్నాడు.
కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం బెల్లంకొండ చాలా కష్టపడుతున్నాడు. సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకొని కష్టపడుతున్న బెల్లంకొండ ఈ సినిమాతో మంచి విజయం సాధించాలనే కసితో ఉన్నాడు . దర్శకుడు వీవీ వినాయక్ బౌండ్ స్క్రిప్టుతో పనులను వేగవంతం చేస్తుండగా, కొద్ది సేపటి క్రితం మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఛత్రపతి ఒరిజినల్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టారు. రమా రాజమౌళి స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ ఏఎం రత్నం డైరెక్ట్ చేయగా, విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
Double Mass Combo @BSaiSreenivas & #VVVinayak's Bollywood Film #BSS9 has launched with a formal Pooja Ceremony!
— BA Raju's Team (@baraju_SuperHit) July 16, 2021
🎬 by @ssrajamouli
🎥Switch on #RamaRajamouli
First Shot Dir #AMRatnam
Script by #VijayendraPrasad
💰@PenMovies @jayantilalgada
Regular shoot begins Today! pic.twitter.com/snbteUfd14