Bro Movie | మరో 20 రోజుల్లో రిలీజ్ కాబోతున్న బ్రో సినిమాపై సినీ లవర్స్ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. పోస్టర్లు, టీజర్లు గట్రా చూస్తుంటే చాలా మార్పులే చేసినట్లు తెలుస్తుంది. ఇక తొలిసారి పవన్, సాయిధరమ్ తేజ్ ఒకేసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజైంది. మై డియర్ మార్కండేయ అంటూ సాగిన పబ్ సాంగ్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. థమన్ స్వర కల్పనలో రూపొందిన ఈ పాటను రేవంత్, సింగ్ధ శర్మ ఆలిపించారు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. పేరుకు పబ్ పాటే అయినా.. లిరిక్స్ మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి. ఇక ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లుగానే చాలా కాస్ట్లీగా పబ్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. లిరిక్ సాంగ్‌లో పవన్ ఎంట్రీ మెగా అభిమానులకు మంచి కిక్కిచ్చింది. ఊర్వశి రౌటేలా అంద, చందాలు కూడా పాటకు ప్లస్ అయ్యాయి.
ఇక బ్రో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు భారీ రేంజ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ వంద కోట్లు దాటిందని తెలుస్తుంది. ఒక్క ఆంధ్ర ఏరియాలోనే దాదాపు రూ.40 కోట్ల రేంజ్లో బిజినెస్ జరుగిందట. అది కూడా సీడెడ్ కాకుండా. ఇక ఓవర్సీస్లో రూ.13 కోట్లు డీలింగ్ ఇప్పటికే ఫిక్సయిపోయిందట. నైజాం, సీడెడ్ సహా మిగిలిన ఏరియాలు అన్ని కలుపుకుని మొత్తంగా వంద కోట్ల నెంబర్ అయితే దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఒక రీమేక్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.