Mrs Universe Sherry Singh | అంతర్జాతీయ వేదికపై భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన మిసెస్ యూనివర్స్ 2025 షెర్రీ సింగ్, మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ముంబైలో జరిగిన ‘లక్మే ఫ్యాషన్ వీక్ 2026’ రెండవ రోజున ఆమె తన అద్భుతమైన ర్యాంప్ వాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. 35 ఏళ్ల వయసులో కూడా తనలోని అజేయమైన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, వివాహం మరియు వయసుపై సమాజంలో పాతుకుపోయిన మూస ధోరణులను ఆమె సవాలు చేశారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా రూపొందించిన ప్రత్యేకమైన ‘ఖాదీ డెనిమ్’ దుస్తుల్లో షెర్రీ సింగ్ షోస్టాపర్‌గా మెరిశారు. ఒక ట్రెంచ్ కోట్, బాంబర్ జాకెట్, స్కర్ట్ మరియు క్రిస్ప్ షర్ట్‌తో కూడిన ఈ కాంబినేషన్ అటు సౌకర్యాన్ని, ఇటు ఫ్యాషన్‌ను అద్భుతంగా ప్రతిబింబించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఫ్యాషన్ అనేది కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, అది నా భావాలను వ్యక్తీకరించే ఒక మాధ్యమం. ఇది నాకు ఒక ప్రేమ భాష వంటిది. మీ కథను మళ్ళీ రాసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. కలలను నిజం చేసుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. మీరు చేయాల్సిందల్లా ఆ అడుగు వేసే ధైర్యం చేయడం మాత్రమే అని షెర్రీ చెప్పుకోచ్చింది.
ఇక షెర్రీ సింగ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. గత ఏడాది ఫిలిప్పీన్స్‌లో జరిగిన మిసెస్ యూనివర్స్ పోటీల్లో 120కి పైగా దేశాల ప్రతినిధులను వెనక్కి నెట్టి, దాదాపు 48 ఏళ్ల తర్వాత ఈ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.