ఉట్కూర్ : నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులను ( Sand Dumps ) రెవెన్యూ అధికారులు గుర్తించారు. అధికారుల అనుమతులు లేకుండా గ్రామ శివారులో ఒకే చోట దాదాపు పది టిప్పర్ల వరకు నిలువ చేసిన ఇసుకను పోలీసుల సహాయంతో విచారణ జరిపి సీజ్ చేసినట్లు తహసీల్దార్ రవి ( Tahasildar Ravi ) తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను తొవ్వినా, తరలించినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.