Atlee | సినిమాపై అంచనాలను పెంచడంలో గోప్యత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో ఒకప్పుడు దర్శకధీరుడు రాజమౌళికు ప్రత్యేక గుర్తింపు ఉండేది. తన సినిమాల సెట్స్‌పై చిన్న సమాచారం కూడా బయటకు రాకుండా కఠినమైన నియమాలు అమలు చేస్తూ, కథ, పాత్రల లుక్స్ అన్నీ ప్రేక్షకులకు సర్ప్రైజ్గా ఉంచేవారు. ఆయన సినిమాలకు సంబంధించిన ప్రతి అంశం పూర్తిగా రహస్యంగా ఉంచడమే ఆయన ప్రత్యేకతగా నిలిచింది. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి తన పాత విధానాన్ని కొంతవరకు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యే వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని ఆయన, ఇప్పుడు మాత్రం సినిమా నిర్మాణానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను బయటకు రానిస్తున్నాడు.
మరోవైపు, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న తన భారీ ప్రాజెక్ట్ విషయంలో గోప్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు అట్లీ . ఈ సినిమాకు సంబంధించిన జానర్, కథ, పాత్రల లుక్స్, నటీనటుల వివరాలు వంటి ఏ అంశం కూడా ఇప్పటివరకు అధికారికంగా బయటకు రాలేదు. సినిమా ప్రారంభమై నెలలు గడిచినా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా చిత్ర యూనిట్ కట్టుదిట్టమైన నియమాలు పాటిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది. గోప్యతను కచ్చితంగా పాటిస్తూ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అట్లీ ముందుకెళ్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, ఒకప్పుడు గోప్యతకు మారుపేరుగా నిలిచిన రాజమౌళి ఇప్పుడు అప్డేట్స్ ద్వారా హైప్ పెంచుతుండగా, అట్లీ మాత్రం అదే గోప్యతను ఆయుధంగా ఉపయోగించి అంచనాలను మరింత పీక్స్‌కి తీసుకెళ్తున్నాడు. ఈ రెండు భిన్నమైన స్ట్రాటజీలు చివరకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.