Suicide | ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
Suicide | ఉద్యోగం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్థాపానికి గురైన యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బండ్లగూడ : ఉద్యోగం ( Job ) రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్థాపానికి గురైన యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య ( Suicide ) కు పాల్పడ్డాడు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన సిద్ధార్థ (27) అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి కార్ సెక్షన్ కాలనీలో నివాసం అంటూ చిరు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గత కొంతకాలంగా ఉద్యోగం లేకపోవడంతో ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాకపోవడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిద్ధార్థ ఎప్పుడూ ఉద్యోగం గురించే ఆలోచించేవాడని మృతుడి సోదరుడు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

