దివంగత నటి , రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత నేపథ్యంలో తలైవి అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్‌తో భారీ అంచనాలు పెంచిన మేకర్స్ మూవీని ఏప్రిల్23న విడుదల చేయాలని అనుకున్నారు. కాని కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది.
ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసింది. తెలుగు తమిళం కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో కథానాయికగా విభిన్న పాత్రలు పోషించారు జయలలిత. ఆమె జీవితంపై సినిమా అనే సరికి అందరిలో ఆసక్తి పెరిగింది. క్లీన్ యూ సెన్సార్ పొందిన ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్ .ఇందులో కంగనా, అరవింద్ స్వామి కనిపిస్తున్నారు. ఈ మూవీని విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు. జయలలిత పదహారేళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్ లో చూపించనున్నారు.