ఎలాంటి ఫలితం ఆశించకుండా పేదలకు, సామాన్యులకు సాయం చేసుకుంటూ వెళుతున్న గొప్ప మానవతావాది సోనూసూద్. గత ఏడాది కరోనా నుండి సోనూసూద్ సాయాలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా ఉన్న నేపథ్యంలో అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపి ప్రాణాలు నిలిచేలా చేశాడు. త్వరలో పలు రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తానంటున్నాడు.
సోనూసూద్ సేవలకు సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఆయనని రియల్ హీరో అని పొగిడేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ..సోనూసూద్‌కు పద్మ విభూషణ్ ఇవ్వాలని కోరాడు. ఆ అవార్డ్‌కి ఆయన అర్హుడని భావిస్తే… పద్మవిభూషణ్ ఫర్ సోనూసూద్ అనే హ్యాష్ ట్యాగ్‌ను రీ ట్వీట్ చేయాలని ట్విట్టర్ వేదికగా కోరాడు. దీనికి స్పందించిన సోనూసూద్.. 135 కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలే నాకు పెద్ద అవార్డ్, దీన్ని ఇప్పటికే సంపాదించుకున్నాను అని అన్నారు.
The love of 135 crore Indians is my biggest award brother, which I have already received.🇮🇳
— sonu sood (@SonuSood) June 11, 2021
Humbled 🙏 https://t.co/VpAZ8AqxDw