Brahmanandam in Panchathantram | తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాల్లో ఈయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. అప్పట్లో తెలుగులో ఏ సినిమా రిలీజైన అందులో బ్రహ్మి కనిపించేవాడు. తన కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించేవాడు. కానీ కొద్ది రోజులుగా బ్రహ్మానందం స్క్రీన్‌పై కనిపించడం లేదు. ఆయన ఆరోగ్యం తిరగబెట్టడంతో మునుపటిలా వరుస సినిమాలు చేయడం లేదు. ఇక కొత్త కమెడియన్స్ కూడా రావడంతో ఆయనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయనే చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు హాస్య బ్రహ్మ.
ఇప్పటి వరకు కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం ఇకపై నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పంచతంత్రం ( Panchathantram ) అనే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బ్రహ్మానందం. తాజాగా విడుదలైన టీజర్లో బ్రహ్మీని హైలైట్ చేశారు దర్శక నిర్మాతలు. అందులో కథకుడిగా కనిపిస్తున్నాడు బ్రహ్మానందం. కొత్త దర్శకుడు హర్ష పులిపాక ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రాజశేఖర్ చిన్న కూతురు, దొరసాని ఫేమ్ శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేశ్ అగస్త్య, దివ్య శ్రీపాద తదితరులు పంచతంత్రం సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్లోనే కొత్తదనం కనిపిస్తుంది.
ప్రతి జీవికి అవసరమైన రంగు, రుచి, వాసన, స్పర్శ, వినికిడి ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథ ఇది. అన్ని ఎమోషన్స్‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ హర్ష ఈ కథను సిద్ధం చేశాడు. ఇందులో కమెడియన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు బ్రహ్మానందం. దీంతో పాటు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో కూడా సీరియస్ పాత్ర చేస్తున్నాడు బ్రహ్మీ. ఇదే పంచతంత్రం సినిమాతో దాదాపు ఆరేళ్ల తర్వాత కలర్స్ స్వాతి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తుంది. కలర్ ఫోటో సినిమాను తెరకెక్కించిన సందీప్ రాజ్ ఈ సినిమాకు మాటలు రాస్తుండటం విశేషం. మరి పంచతంత్రం సినిమాతో బ్రహ్మానందం ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Brahmanandam | జబర్దస్త్ కమెడీయన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!
Maha Samudram pre release | మహా సముద్రం ప్రివ్యూ.. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?
ముక్కలైపోతున్న మా అసోసియేషన్.. సో కాల్డ్ సినీ పెద్దలేం చేస్తున్నారో..?
కాను కానంటూనే సినీ పెద్దవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు !
Avika Gor | ఆ అనుభవం చాలా నేర్పించింది: అవికాగోర్