జబర్దస్త్ కమెడీయన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!

సీనియర్ కమెడీయన్ బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో స్క్రీన్ పై ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు ఏడాదికి 20 సినిమాలకు పైగానే నటించిన బ్రహ్మి.. ఇప్పుడు కనీసం 3 సినిమాలు కూడా చేయడం లేదు. మధ్యలో అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం అయ్యాడు బ్రహ్మానందం. దాంతో పాటు రెమ్యునరేషన్ కారణంగానూ బ్రహ్మిని దూరం పెట్టారు. అన్నింటికి మించి కొత్త కమెడియన్లు వచ్చారు.. జబర్దస్త్ నుంచి కూడా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. అంతమంది రావడంతో సీనియర్ కమెడియన్లు దాదాపు స్క్రీన్ పై కనిపించడం మానేసారు. అందులో బ్రహ్మానందం కూడా ఉన్నాడు.
దానికి తోడు సీనియర్ కమెడియన్లు చాలా మంది చనిపోవడంతో బ్రహ్మికి అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన జబర్దస్త్ కమెడియన్ ను ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం అరకొర సినిమాలతోనే కాలం గడిపేస్తున్న బ్రహ్మానందం.. రంగమార్తండతో పాటు పెళ్లి సందడి సినిమాలోనూ నటిస్తున్నాడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.. శ్రీలీల హీరోయిన్. ఇందులో బ్రహ్మానందం బిల్డప్ బాబాయ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
బిల్డప్ బాబాయ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది గెటప్ శ్రీను. జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఈ పాత్రకు కూడా అంతే గుర్తింపు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇదే పాత్రను అదే మాడ్యులేషన్ లో పెళ్లి సందడి సినిమాలో రాఘవేంద్రరావు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా జబర్దస్త్ కమెడియన్ ను ఫాలో అయిపోతున్నాడు బ్రహ్మానందం.
ఇవి కూడా చదవండి..
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

