Brahmanandam | టాలీవుడ్ స్టార్ కామెడియన్ బ్రహ్మనందం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని బ్రహ్మనందం స్వయంగా వెల్లడించాడు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam). వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆర్వీఎస్ నిఖిల్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీమర్స్‌తో ఇటీవలే చిట్‌చాట్‌ని నిర్వహించాడు బ్రహ్మి. అయితే ఈ వేడుకలో మీమర్స్ బ్రహ్మిని అడుగుతూ.. సార్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎప్పుడు వస్తారు అడుగుతారు.
దీనికి బ్రహ్మి సమాధానమిస్తూ.. మీ అందరికీ ఒక సర్ప్రైజ్. నేను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చేశాను. నా యూజర్ ఐడీ.. యువర్స్ బ్రహ్మి.. నేను వచ్చి వారం కంటే ఎక్కువ కాలేదు అంటూ చెప్పాడు. అయితే ఈ విషయం చెప్పిన అనంతరం నుంచి బ్రహ్మికి విపరీతమైన ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇప్పటికే 3 లక్షల ఫాలోవర్లను 3 రోజుల్లో సంపాదించుకున్న బ్రహ్మి తాజాగా 6 లక్షల 59 వేల ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. ఇక మొదటి పోస్ట్‌గా తనకు ఇష్టదైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలుస్తూ ఫొటోను పంచుకున్నాడు.