Brahmanandam | కొందరు కమెడియన్లు నటిస్తే ప్రేక్షకుల ముఖంపై చిరు నవ్వు కనిపిస్తుంది. కానీ బ్రహ్మానందం తెరపై కనిపిస్తే మాత్రం నాన్‌స్టాప్‌గా నవ్వుకుంటూనే ఉంటాం. అంతలా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన బ్రహ్మానందం ఏకంగా 1200కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇటీవల ఆయన మీ అండ్ మై పేరుతో తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ఆవిష్కరించారు . తెలుగు సినీ పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరుగాంచిన బ్రహ్మానందం, దశాబ్దాలుగా ప్రేక్షకులను నవ్వించి ఓ లెజెండ్రీ కమెడీయన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
1200కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం ఆయనకే చెల్లింది.. చూడడానికి చిన్నగా ఉన్నా, అతనికి ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్స్, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, నవ్వించే డైలాగ్స్ ఎంతో మంది అభిమానులను అలరించాయి.తెలుగు పరిశ్రమలోనే కాక, దేశవ్యాప్తంగా స్టార్ హీరోలతో పనిచేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునే హాస్య నటుడు బ్రహ్మనందం మాత్రమే. తన కెరీర్ ప్రారంభంలో లెక్చరర్‌గా పని చేసిన బ్రహ్మానందం, హాస్యం, యాక్టింగ్ పట్ల ఆసక్తి చూపి సీనీరంగంలో అడుగుపెట్టారు.
బ్రహ్మానందం ఇటీవల పలు టీవీ షోల్లో, ప్రముఖ స్ట్రీమింగ్ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా “తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4”లో హాజరై తన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల కాగా, ఈ ప్రోమోచివర్లో బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టడం అందరిని బాధించింది. లెజెండ్రీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గురించి హోస్ట్ అడిగినప్పుడు, తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సాన్నిహిత్యం గురించి గుర్తు చేసుకున్నారు. మంచి మనిషి అంటూ కామెంట్ చేశారు. ఎప్పుడు నవ్వించే బ్రహ్మానందం ఇలా కన్నీరు పెట్టుకోవడం చూసి ఫ్యాన్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు.