Brahmakalasha | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara)కు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: చాప్టర్ 1’ నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొదటి భాగంలో క్లైమాక్స్‌లో వచ్చే ‘వరాహరూపం’ పాట ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. అదే తరహాలో, ఈ ప్రీక్వెల్‌లో కూడా శక్తివంతమైన పాటను మేకర్స్ చేర్చారు. తాజాగా విడుదలైన ఈ పాట ‘బ్రహ్మ కలశ’ పేరుతో శివుడిని భక్తితో ఆరాధించే విధంగా, శక్తిమంతమైన సంగీతంతో ఉంది. ఈ పాట వింటుంటేనే మొదటి భాగంలోని ‘వరాహరూపం’ పాట ఇచ్చే అనుభూతిని గుర్తు చేస్తోందని అభిమానులు అంటున్నారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. అబ్బి వి పాడాడు. రిషబ్ శెట్టి మార్క్ మేకింగ్‌తో, అజనీష్ లోక్‌నాథ్ సంగీతంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.