Brahmaji | నటుడు బ్రహ్మాజీ టైమింగ్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోను తెగ నవ్విస్తుంటాడు. ఈ మధ్య సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుతున్నాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా షేర్ చేస్తున్నాడు. అయితే బ్రహ్మాజీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీకి తప్పక కొంత సమయం కేటాయిస్తుంటాడు. తన భార్యతో ప్రపంచ దేశాలు తిరగడం తనకు ఇష్టమని బ్రహ్మాజీ చెబుతుంటాడు. తాను సంపాదించిన డబ్బు అంతా కూడబెట్టడం గానీ, ఇన్వెస్ట్ చేయడం వంటిది చేయను. వాటితో ప్రపంచదేశాలు చుట్టి వస్తానని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.
బ్రహ్మాజీది ప్రేమ పెళ్లి. వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ కథ గురించి కూడా బ్రహ్మాజీ ఇది వరకు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అయితే తన భార్యతో కలిసి అన్ని దేశాలు తిరిగి రావడమే తనకు ఇష్టమని బ్రహ్మాజీ అంటుంటాడు. ఈ రోజు బ్రహ్మాజీ వెడ్డింగ్ డే కావడంతో తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ అంటూ స్పెషల్‌గా విషెస్ అందించాడు. పెరుగన్నంలోకి ఆవకాయ్ లా.. పాలకు డెవిడోఫ్ కాఫీలా.. వోడ్కాకి జింజిర్ ఆలేలా.. నా జీవితానికి నవ్వుల్లా.. నన్ను భరిస్తున్నందుకు థాంక్స్.. హ్యాపీ యానివర్సరీ సస్వతి అంటూ బ్రహ్మాజీ పోస్ట్ పెట్టాడు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
బ్రహ్మాజీ సరదా మనిషే కాదు సీరియస్ కూడా. కొన్ని సార్లు ఆయన చేస ట్వీట్స్ వివాదాలకి కూడా దారి తీస్తుంటాయి. పాలిటిక్స్ పై కూడా తనదైన శైలిలో సెటైర్స్ వేస్తుంటాడు బ్రహ్మాజీ. రీసెంట్గా బౌన్సర్ల వ్యవస్థ మీద స్పందించిన బ్రహ్మాజీ తనదైన శైలిలో చురకలు అంటించాడు. అయితే గతంలో మాదిరిగా బ్రహ్మాజీ పెద్దగా సినిమాలు చేయడం లేదు. పుష్ప2 లో తనదైన నటనతో అలరించాడు. ఇక బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా, ఆయన చిన్నా చితకా ప్రాజెక్టులతో ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.