సినిమా ఇండస్ట్రీలో కొందరి మధ్య చాలా చనువు ఉంటుంది. ఆ చనువుతోనే ఒక్కోసారి సోషల్ మీడియాలోను సరదా పంచ్‌లు వేస్తుంటారు. తాజాగా బ్రహ్మాజీ.. రాజీవ్ కనకాలపై అదిరిపోయే పంచ్ వేశాడు. వివరాలలోకి వెళితే రాజీవ్ కనకాల తాజాగా తన సోషల్ మీడియాలో 2018లో చెన్నై ఎయిర్ పోర్ట్‌లో తన దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగిన అభిమాని ఫొటో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి క్లీనింగ్ విభాగానికి చెందిన వ్యక్తి కాగా, సంతోషంగా నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడు.
అతని దగ్గర ఫోన్ లేకపోవడంతో నా కెమెరాలోతీసి పంపమని కోరాడు. అప్పుడు పనుల్లో పడి మరచిపోయాను. ఆ ఫోటోని ఇప్పుడు పంపుతున్నాను. అది అతనికి చేరుతుందని ఆశిస్తున్నాను అంటూ రాజీవ్ కనకాల తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్ట్‌పై బ్రహ్మాజీ తనదైన శైలిలో పంచ్ వేశారు. ‘ఇంకా 10 సంవత్సరాల తర్వాత పోస్ట్ చేయాల్సింది..’ అంటూ సరదాగా కామెంట్ చేశారు.