Rahul Yadav | ‘తాత, మనవడి అనుబంధం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఎమోషన్స్‌తోపాటు ఎంటైర్టెన్మెంట్ కూడా ఉంటుంది. మా తాత నన్నొక సక్సెస్ఫుల్ పర్సన్‌గా చూడాలనుకున్నారు. కానీ ‘మళ్లీ రావా’ టైమ్‌లోనే ఆయన కాలం చేశారు. ఆయనకు నివాళిగా ఈ సినిమా తీశా.’ అని నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా అన్నారు. మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూద చిత్రాలను నిర్మించారాయన. ఆయన ప్రొడక్షన్లో వస్తున్న నాల్గవ చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆర్వీయస్ నిఖిల్ దర్శకుడు.
ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘బ్రహ్మానందం అనే టైటిల్‌తోనే దర్శకుడు ఈ కథ రాశాడు. బ్రహ్మానందంగారికి కూడా కథ బాగా నచ్చి ఓకే చేశారు. ఇప్పటివరకూ చూడనటువంటి గొప్ప పాత్రలో ఇందులో బ్రహ్మానందం కనిస్తారు. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు అంతా బ్రహ్మానందం కోసం వస్తారు. కానీ ఇంటికెళ్లేటప్పుడు మాత్రం రాజా గౌతమ్‌ను తీసుకెళ్తారు. అంతబాగా చేశాడు తను. గౌతమ్‌తో మళ్లీ ‘వైబ్’ అనే సినిమా చేస్తున్నా. స్వరూప్ ఆర్ఎస్జె ఆ చిత్రానికి దర్శకుడు’ అని తెలిపారు