Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య రివేంజ్ లా అనిపిస్తుంది. ముందు నుంచి సందీప్ చెప్పినట్లుగనే తన అసలైన వైలెన్స్‌ను చూపించబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
‘యానిమల్’(Animal) షూటింగ్లో భాగంగా రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కలిసి దిగిన ఓ వర్కింగ్ స్టిల్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. చిత్రబృందం దీనికి ‘బాయ్స్ ప్రిపేరింగ్ ఫర్ ది బృటల్ హంట్’ (అబ్బాయిలు క్రూరమైన వేటకు సిద్ధమవుతున్నారు) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Boys Prepping for the 𝐁𝐫𝐮𝐭𝐚𝐥 𝐇𝐮𝐧𝐭 🔥#RanbirKapoor @imvangasandeep #AnimalOn1stDec #Animal #AnimalTheFilm pic.twitter.com/7LpO95qHfj
— Animal The Film (@AnimalTheFilm) November 8, 2023
ఇక ఈ సినిమాలో బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ నటిస్తుండగా. గీతాంజలిగా రష్మిక నటిస్తుంది. ఈ సినిమాలో బాబీ డియోల్, సీనియర్ నటుడు పృథ్వీ రాజ్ విలన్ రోల్స్‌లో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాబీ డియోల్ లవ్ హాస్టల్ (Love Hostel) సినిమాలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక యానిమల్‌లో బాబీ రోల్ ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.