Boys Hostel Movie | రెండు నెలల కిందట కన్నడలో రిలీజై కోట్లు కొల్లగొట్టిన హాస్టల్ హుదుగురు బెకగిద్దారే సినిమా ఇటీవలే బాయ్స్ హాస్టల్ పేరుతో తెలుగులో రిలీజైంది. అన్నపూర్ణ స్డూడియోస్‌తో కలిసి ఛాయ్ బిస్కెట్సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. అయితే కన్నడ రేంజ్లో హిట్టు మాత్రం అవ్వలేదు. యూత్ మెచ్చే కంటెంటే అయినా.. ఇక్కడి ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. దాంతో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది.
ఈ సినిమా సెప్టెంబర్ 15నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో స్ట్రీమింగ్ కానుంది. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్లో పలు మార్పులు కూడా చేశారు. కన్నడలో రిషబ్ శెట్టి, రమ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్‌లు పోషించారు. ఇక ఈ సినిమా మొత్తం హాస్టల్లోని వార్డెన్ శవం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హాస్టల్లో ఉండే ఓ కుర్రాడు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఈ మేరకు తను రాసుకున్న ఓ షార్ట్‌ఫిలిం స్టోరీని తన ఫ్రెండ్స్‌కు చెబుతుంటాడు.
కాగా ఈ కుర్రాడు చెప్పిన షార్ట్‌ఫిల్మ్‌లో మాదిరిగానే నిజంగానే వారి హాస్టల్ వార్డెన్ చనిపోతాడు. అతని వద్ద ఒక సూసైడ్ లెటర్ ఉంటుంది. ఇక అందులో ఆ కుర్రాడితో పాటు స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి. దాంతో వార్డెన్ శవాన్ని దాచి పెట్టేందుకు హాస్టల్ బాయ్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలో వారికి ఎదురైన అనుభవాలేంటి అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి క్రైమ్ చుట్టూ కామెడీని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి వంద మార్కులు కొట్టేశాడు.