‘బాయ్స్ హస్టల్’ కథకు యూనివర్శల్ అప్పీల్ వుంది. హాస్టల్స్ ప్రపంచంలో అన్ని చోట్ల వున్నాయి. ఇందులో వున్న పాత్రలు కూడా అందరూ రిలేట్ చేసుకునేలా వుంటాయి’ అన్నారు దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి. ఆయన దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’పేరుతో విడుదల చేస్తున్నారు.
ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ కొన్ని రోజుల క్రితం చిత్రాన్ని కొంత మంది ఆడియన్స్‌కి చూపించాం. చూసిన వారంతా చాలా ఎంజాయ్ చేశారు. ఇది డబ్బింగ్ సినిమాలా అనిపించదు. డబ్బింగ్ వాయిసెస్ కూడా చాలా సహజంగా వుంటాయి. ప్రేక్షకులకు ఫ్రెష్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో రిషబ్ శెట్టి పాత్ర చాలా ఆసక్తికరంగా వుంటుంది. హాస్టల్లో చదువుకున్న పూర్వ విద్యార్థిలా కనిపిస్తారు. ఈ కథలో ఆయన పాత్ర ఊహతీతంగా వుంటుంది. ఇందులో ఆయన ఐదు నిమిషాల సీన్‌ని సింగిల్టేక్లో చేశారు. ఈ కథకు మ్యూజిక్ స్కోప్ లేకపోయినా అంజనీష్ లోక్‌నాథ్ సవాల్‌గా తీసుకుని ఈ ఈ చిత్రాన్ని మ్యూజికల్ ఫిల్మ్‌గా మార్చారు’ అన్నారు.