షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘పఠాన్’. ఈ చిత్రంలో దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్నది. జాన్ అబ్రహాం మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘బేషరమ్ రంగ్..’ పాట పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ సెగ మళ్లీ ఈ సినిమాకు తగులుతున్నది.
ఈ పాటలో దీపికా వేసుకున్న దుస్తులు, వీరి మధ్య పాటను చిత్రీకరించిన విధానం అభ్యంతరకరంగా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నది. వచ్చే జనవరి 25న ‘పఠాన్’ విడుదల తేదీగా ప్రకటించారు.