Boycott PVR | భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఆఫర్‌తో పీవీఆర్ ముందుకు వచ్చి చిక్కుల్లో పడింది. ఈ వివాదాస్పద ఆఫర్‌తో బాయ్‌కాట్ పీవీఆర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
వివరాల్లోకెళితే.. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేలా చేయడానికి కేవలం రూ.699లకే 10 సినిమాలను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పీవీఆర్ సినిమాస్ (PVR Cinemas) వెల్లడించింది. కాగా ఈ ఆఫర్ నేటి నుంచి (అక్టోబర్ 16) నుంచి ప్రారంభం అయ్యింది. అయితే ఆఫర్ ప్రకటించిన కొద్ది సేపటికే పీవీఆర్ బాయ్‌కాట్ (Boycott PVR) అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది. దీనికి కారణం ఎంటి అని చూస్తే.. ఈ ఆఫర్ భారత్‌లో ఎక్కడైనా పనిచేస్తుంది కానీ సౌత్ ఇండియాలో వర్తించదు అంటూ పీవీఆర్ ప్రకటించింది. దీంతో సౌత్ ఇండియా మూవీ ఫ్యాన్స్ పీవీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. ఇకపై పీవీఆర్‌లో మూవీ చూడొద్దంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
The entire South should boycott PVR-INOX theaters because of their continuous bigotry against South India.@_PVRCinemas @INOXMovies pic.twitter.com/8dnlvD1DOF
— Fukkard (@Fukkard) October 16, 2023
#PVRINOX, what is the harm South Indian audiences do to you? @_PVRCinemas pic.twitter.com/irlI1uM92g
— Aakashavaani (@TheAakashavaani) October 16, 2023
We at PVR INOX feel, that movie lovers of India deserve the freedom to watch every movie. Yes, this was easier said than done, but we have made it happen, only for you, because for us, your choice, your freedom, your opinion matters.
Introducing #PVRINOXPassport #PVRHeardYou2… pic.twitter.com/Opi4ktKghL
— P V R C i n e m a s (@_PVRCinemas) October 15, 2023
ఇక పీవీఆర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా.. 30 రోజులకు రూ.699 చెల్లించి ఏదైనా PVR థియేటర్లో 10 సినిమాలను వీక్షించవచ్చు. అయితే ఈ ఆఫర్ విక్ డేస్‌లో (సోమవారం నుండి శుక్రవారం) మాత్రమే వర్తించనుంది.