Prabhas Fauji | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వివాదంలో చిక్కుకుంది. ప్రభాస్ చిత్రంలో పాకిస్థాన్ నటి నటిస్తుండటంతో ఈ చిత్రంపై నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 28 మంది మరణించారు. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా.. తాజాగా ఈ వివాదం టాలీవుడ్‌కి పాకింది.
పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి – ప్రభాస్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా పాకిస్థాన్‌కి నటి ఇమాన్ ఎస్మాయిల్ నటించబోతుంది. అయితే కశ్మీర్లో ఉగ్రదాడి అనంతరం నిరసనలు వెల్లువెత్తుతుండగా.. ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటిని ప్రమోట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. వెంటనే ఈ ప్రాజెక్ట్ నుంచి ఇమాన్ ఎస్మాయిల్ను తొలగించాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ వివాదంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటునట్టు తెలుస్తున్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండగా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్ కనిపించనున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు.