Vijay Devarakonda | విజయ్ దేవరకొండ-బోయపాటి శ్రీను.. నిజంగా ఇది ఊహించని కాంబినేషన్. విజయ్ ైస్టెలిష్ చిత్రాల కథానాయకుడు. అతనిది విభిన్నమైన ఇమేజ్. ఇక బోయపాటి శ్రీను విషయానికొస్తే ఊరమాస్. వీరిద్దరి కలయికలో సినిమా అంటే, నిజంగా అది ఆసక్తికరమైన విషయమే. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వీరిద్దరి కలయికలో సినిమా చేయడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం.
సదరు నిర్మాణ సంస్థ వద్ద బోయపాటి, దేవరకొండ డేట్లు ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ తెరమీదకు వచ్చింది. నిర్మాత ఆదేశాల మేరకు విజయ్ కోసం కథ తయారు చేసే పనిలో పడ్డారట బోయపాటి శ్రీను. విజయ్ దేవరకొండ కూడా నిర్మాత ఆదేశాల మేరకు కథ వినడానికి రెడీ అయ్యారట. మరి ఈ ప్రాజెక్ట్ ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో వేచిచూద్దాం!.