స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) త్వరలో తన నెక్ట్స్ మూవీని లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. రామ్ పోతినేని (Ram Pothineni) తో బోయపాటి సినిమా ఉండబోతుందని లేటెస్ట్ టాక్. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం బోయపాటి గతంలో పనిచేసిన అందాల తారను బోర్డుపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ భామ ఎవరనే కదా మీ డౌటు. మీరా జాస్మిన్ (Meera Jasmine).
బోయపాటి, రవితేజ (Raviteja), మీరాజాస్మిన్ కాంబోలో వచ్చిన చిత్రం భద్ర (Bhadra). బాక్సాపీస్ వద్ద మంచి హిట్టుగా నిలిచింది. ఇపుడు మీరా జాస్మిన్ ను మళ్లీ చాలా కాలం తర్వాత తెలుగు తెరపైకి మెరిపించేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది. మీరా జాస్మిన్ చాలా కాలం తర్వాత తాజాగా గ్లామరస్ డోస్‌ను పెంచుతూ దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. తనకు మంచి హిట్టు ఇచ్చిన బోయపాటితో సినిమా చేసేందుకు మీరా జాస్మిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని తెగ గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.
అయితే మీరాజాస్మిన్ మాత్రం లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ ప్రాజెక్టుకు ఒకే చెప్తే..మరి గ్లామర్ రోల్లో కనిపిస్తుందా..? పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్లో కనిపిస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది. మీరా ఒప్పుకుంటే ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని గాసిప్స్ తెరపైకి వస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు మూవీ లవర్స్.