Boyapati Sreenu | బోయపాటి ఏంటీ థమన్‌ను అలా తీసి పడేశాడు..!
Boyapati Sreenu | రెండేళ్ల కిందట వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టంచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని చోట్ల 50% ఆక్యూపెన్సీతో రిలీజై కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ దక్కింది థమన్ మ్యూజిక్కే.
Boyapati Sreenu | రెండేళ్ల కిందట వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టంచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని చోట్ల 50% ఆక్యూపెన్సీతో రిలీజై కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ దక్కింది థమన్ మ్యూజిక్కే. సో సోగా ఉన్న ఎన్నో సీన్లకు థమన్ తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. మరీ ముఖ్యంగా బాలయ్య ఇంట్రో సీన్లకు, ఆయన డైలాగ్స్ చెప్పే అప్పుడు వచ్చే మ్యూజిక్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇలా సినిమా మొత్తం థమన్ మ్యూజికే వినబడతుంది. ఒక సినిమాకు మ్యూజిక్ ఎంత అవసరమో అఖండ సినిమా చూస్తే సరిపోతుంది అన్న రేంజ్లో మ్యూజిక్ కొట్టాడు.
కాగా తాజాగా బోయపాటి థమన్ మ్యూజిక్‌ను కాస్త తక్కువ చేసినట్లు మాట్లాడు. థమన్ మ్యూజిక్ లేకుండా అఖండ చూసినా.. ప్రేక్షకులకు అంతే ఎగ్జైట్మెంట్ కలిగించేదని.. ఆ సినిమాను చూసి గర్వపడేవాళ్లని బోయపాటి వెల్లడించాడు. ఆ కథలో అంత దమ్ము ఉందని, సినిమాలో అంత విషయం ఉండబట్టే తమన్ కూడా ఎంతో ఇన్స్పైర్ అయి నేపథ్య సంగీతం చేశాడని.. ఈ విషయంలో తన క్రెడిట్ తనకు ఇవ్వాల్సిందే అని బోయపాటి చెప్పుకొచ్చాడు. ఓ వైపు థమన్‌ను తక్కువ చేసి మాట్లాడుతూనే మరోవైపు క్రెడిట్ తనకే అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.
దీనిపై పలువురు థమన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అసలు అఖండ సినిమాకు మేజర్ బ్యాక్బోనే థమన్ మ్యూజిక్ అని, ఆయన మ్యూజిక్ లేకపోతే అఖండ కొట్టుకేపోయేదని కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

