Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Ranabaali | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. రష్మిక మందన్న నాయికగా నటించిన ఈ చిత్రం, విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా బుకింగ్స్‌కు సంబంధించి మేకర్స్ వెల్లడించిన అప్డేట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
గత 24 గంటల వ్యవధిలో ఈ చిత్రానికి సంబంధించి భారీ స్థాయిలో 1,39,740 టికెట్లు అమ్ముడయ్యాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా దూసుకుపోతుండటానికి ఈ టికెట్ విక్రయాలే నిదర్శనమని చిత్ర బృందం స్పష్టం చేసింది. హీరో విజయ్ దేవరకొండపై ఉన్న మాస్ క్రేజ్, సినిమాకు వస్తున్న మౌత్ టాక్ కారణంగా కలెక్షన్ల జోరు మరింత పెరిగింది. రాయలసీమ నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశం, యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించేలా చేస్తున్నాయి. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

