Border 2 | దేశభక్తి కథాంశంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజే భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సాధించిన రూ.28.60 కోట్ల తొలిరోజు వసూళ్ల రికార్డును ‘బోర్డర్ 2’ అధిగమించడం విశేషం. సన్నీ దేవోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని ఎంతో ఉద్వేగభరితంగా తెరకెక్కించారు.
1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో జేపీ దత్తా సృష్టించిన క్లాసిక్ ‘బోర్డర్’కు సుదీర్ఘంగా 28 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈసారి కేవలం ఆర్మీ పోరాటానికే పరిమితం కాకుండా, భారత సైన్యంలోని మూడు విభాగాలు అంటే ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన త్రిముఖ పోరును ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. యుద్ధ భూమిలో మన సైనికుల పరాక్రమాన్ని, ఉత్కంఠ రేకెత్తించే సరిహద్దు పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
Released on a non-holiday / working day, #Border2 takes a flying start on Day 1 – registering not only the *biggest opening of 2026* so far, but also matching the *biggest opener of 2025* – #Chhaava [₹ 33.10 cr].#Border2 has performed exceptionally well in the mass belts, with… pic.twitter.com/rrUNxe5weF
— taran adarsh (@taran_adarsh) January 24, 2026