అందాల ముద్దుగుమ్మ జెనీలియా కెరీర్‌లోని బెస్ట్ చిత్రాలలో బొమ్మరిల్లు ఒకటి. హాసిని అనే పాత్రలో ఎంతో అమాయకంగా కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంత మంచి పాత్రను జెనీలియా మొదట్లో వద్దని చెప్పిందట. షూటింగ్ మొదలైన కొద్ది రోజులకు సినిమా చేయనని సీరియస్‌గా డైరెక్టర్‌కి చెప్పిందట. ఆ సమయంలో సెట్లో బన్నీ ఉండడంతో ఆమెకు నచ్చజెప్పి ఒప్పించాడట.
బొమ్మరిల్లు మొదలైన తొలి రోజుల్లో.. హీరో, హీరోయిన్ ఐస్‌క్రీమ్ తినే షాట్‌ని రాత్రి 9 గంటలకు మొదలు పెట్టాడట దర్శకుడు భాస్కర్. అది తెల్లవారుజాము వరకు కొనసాగిందట. రెండు డైలాగులున్న సన్నివేశం కోసం ఏకంగా 35 టేక్స్ చేశారట. దీంతో జెనీలియా విసుగెత్తిపోయి దర్శకుడు భాస్కర్ మీద నమ్మకం కోల్పోయిందట. చిన్న సన్నివేశం కోసం ఒక ఫుల్ నైట్ టైం పట్టడంతో తాను ఈ సినిమా చేయలేనంటూ కోపంగా ఆమె సెట్స్ నుంచి వెళ్లిపోయిందట.
ముందు ఈ సినిమా కథని బన్నీకి చెప్పడంతో కాల్షీట్స్ ఖాళీ లేక చేయలేదు. కాకపోతే అప్పుడప్పుడు సెట్‌కి వచ్చి చూస్తుండేవాడు. ఆ క్రమంలో కోపంతో ఉన్న జెనీలియాకి బన్నీ నచ్చజెప్పాడు. భాస్కర్ చాలా మంచి దర్శకుడు ఒక్క సీన్ చూసి అతడిని అంచనా వేయకు. ఈ సినిమా కచ్చితంగా నీ కెరీర్‌ను మలుపుతిప్పుతుంది. దీన్ని వదులుకోకు అని జెన్నీకి నచ్చజెప్పాడట బన్నీ. అలా జరగకపోయి ఉంటే జెనీలియా తన కెరీర్లో మంచి చిత్రం మిస్ అయి ఉండేది.