Amitabh bachchan | ఈ మధ్య సినిమా వాళ్ల ఇళ్లకు ఫోన్ చేసి బాంబులు పెట్టామని బెదిరించడం కామన్ అయిపోయింది. కొందరు ఆకతాయిలు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని పోలీసులు కూడా చెప్తున్నారు. తమిళనాట ఇప్పటికే విజయ్, అజిత్ లాంటి హీరోలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. తాజాగా ముంబైలోని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంటికి కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
అబితాబ్ ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. కేవలం అమితాబ్ ఇంటిని మాత్రమే కాదు.. ముంబైలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చి వేస్తామని వాళ్లు హెచ్చరించారు. బాంబుల శబ్ధం దద్దరిల్లుతుందంటూ ముంబై ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు.. జుహులోని నటుడు అమితాబ్ బంగ్లా దగ్గర బాంబులు పెట్టామని తెలిపారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమితాబ్ ఇంటితో పాటు ఆయా ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేశారు. అయితే పోలీసుల సోదాలలో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదని తెలుస్తోంది. కేవలం అది ఫేక్ కాల్స్ అని నిర్ధారించుకున్నారు పోలీసులు. ఇలాంటి కాల్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తుండటంతో వాటిపై ఫోకస్ చేశారు ముంబై పోలీసులు. అలాగే ఆగస్టు 15 సమీపిస్తుండటంతో నగరంలోని పలుచోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
చిరంజీవి లూసిఫర్ రీమేక్‌లో విలన్‌గా సత్యదేవ్ ?
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోయిన్ల హవా