Halloween2025 | పండుగలైనా, ప్రత్యేక వేడుకలైనా బాలీవుడ్ (Bollywood) తారలు సందడి చేయడంలో ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో జరిగిన హాలోవెన్ (Halloween) పార్టీకి సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో హాజరై అదరగొట్టారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె (Deepika Padukone) ఆలియా భట్ (Alia Bhatt) ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దీపికా పదుకొనె తాను నటించిన యాక్షన్ చిత్రం ‘సింగం అగైన్’ (Singham Again) లోని తన పాత్ర లేడీ సింగం (Lady Singham) పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించగా. ఖాకీ యూనిఫామ్, క్యాప్ మరియు బ్లాక్ షేడ్స్‌తో దీపికా చాలా శక్తివంతంగా, ఆకర్షణీయంగా కనిపించారు. తన సినిమాలోని లుక్‌నే హాలోవెన్ కాస్ట్యూమ్‌గా ఎంచుకోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఇక ఆలియా భట్ టాంబ్ రైడర్ (Tomb Raider) లోని సాహసోపేతమైన కథానాయిక లారా క్రాఫ్ట్ (Lara Croft) అవతారంలో మెరిశారు. ఆమె నల్లటి షార్ట్స్, టీ-షర్ట్, ఆమె ఐకానిక్ హెయిర్ స్టైల్ అయిన జడ (braid), తొడల వద్ద హోల్స్టర్లు (thigh holsters) మరియు చేతిలో గన్ ప్రాప్తో అచ్చం లారా క్రాఫ్ట్‌లా కనిపించి హైలైట్‌గా నిలిచారు.
ఇక దీపికా, ఆలియాతో పాటు ఇతర స్టార్స్ కూడా ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్‌తో పార్టీకి వచ్చి ఆకట్టుకున్నారు ఇందులో దీపికా భర్త, నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) ప్రముఖ మార్వెల్ పాత్ర స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్‌లో తన మార్క్ ఎనర్జీని చూపించారు. జాన్వీ కపూర్ ఎంజెలా డీ మార్కో పాత్రలో కనిపించగా.. అర్జున్ కపూర్ టర్మినేటర్ పాత్రలో అలరించాడు. దర్శకుడు అయాన్ ముఖర్జీ హ్యారీ పాటర్ పాత్రలో కనిపించగా.. కరణ్ జోహార్ లార్డ్ అంటోని బ్రిడ్జర్టన్ పాత్రలో అలరించాడు. షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) బ్రోక్‌బ్యాక్ మౌంటెన్ పాత్రలో అలరించాడు. కాగా వీరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హాలోవెన్ పార్టీ
హాలోవెన్ అనేది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ప్రతీ సంవత్సరం అక్టోబర్ 31 న జరుపుకునే ఒక వేడుక. ఈ రోజున నిర్వహించే పార్టీలనే హాలోవెన్ పార్టీ అంటారు. ఈ వేడుకకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది ఐర్లాండ్‌లో మొదలైన పురాతన సెల్టిక్ పండుగైన సామాయిన్ (Samhain) నుండి ఉద్భవించినట్లు ప్రజలు చెబుతారు. సెల్టిక్ సంస్కృతిలో ఈ రోజున చనిపోయిన ఆత్మలు (దయ్యాలు, భూతాలు) భూమిపైకి వస్తాయని.. అయితే ఇందులో చెడు ఆత్మలను భయపెట్టి తరిమికొట్టడానికి లేదా వాటిని వశపరుచుకోవడానికి ప్రజలు విచిత్రమైన దుస్తులును ధరించి వాటిని భయపెట్టేవారని సమాచారం. ఇక ఈ హాలోవెన్ పార్టీలు సరదాగా భయనక వాతావరణంలో జరుపుకుంటారు.