Amitabh To Shahrukh | సినిమా నటులు అనగానే కోట్లకు కోట్ల పారితోషికం తీసుకుంటారని వింటూ ఉంటాం. కొందరూ స్టార్ నటులు ఒక సినిమాకు రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటే మరికొందరూ వారి క్రేజ్‌ని బట్టి రూ.100 నుంచి రూ.200 కోట్ల డిమాండ్ చేస్తున్నారు. అయితే భారతీయ ఇండస్ట్రీలో ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటించిన వాళ్లు ఉన్నారు అంటే నమ్ముతారా.! బాలీవుడ్ బిగ్ బీతో పాటు షారుఖ్ ఖాన్ తదితరులు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారు. అయితే నటించిన సినిమాలు ఏంటి అనేది చూసుకుంటే..
అమితాబ్ బచ్చన్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అనగానే వెంటనే గుర్తోచ్చే పేరు బీగ్ బీ అమితాబ్ బచ్చన్. షోలే, జంజీర్, కూలీ, అగ్నిఫథ్, సర్కార్, డాన్ వంటి చిత్రాలతో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బీ డబ్బు, రివార్డుల కంటే కళకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ సినిమాకు ఎలాంటి ఫీజు లేకుంగా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా.. విమర్శల ప్రశంసలు అందుకుంది. ఇదే కాకుండా 2021లో వచ్చిన చెహ్రే సినిమాలో కూడా బచ్చన్ ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని దర్శకుడు రూమీ జాఫ్రీ వెల్లడించాడు. అంతేగాకుండా ఈ సినిమా షూటింగ్ పోలాండ్‌లో జరిగితే తన ప్రయాణంకు సంబంధించి అలాగే వసతి ఖర్చులను కూడా తానే చూసుకున్నాడని తెలిపాడు.
షారుఖ్ ఖాన్
Shahrukh Khan
బిగ్ బీ తర్వాత ఇండియాలో అంత స్టార్డమ్ సంపాదించిన ఒకే ఒక వ్యక్తి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ప్రపంచంలో ఉన్న అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటులలో ఇండియా నుంచి షారుఖ్ కూడా ఒక్కడన్న విషయం తెలిసిందే. షారుఖ్ ఒక్క సినిమాకు దాదాపు రూ.150 కోట్లకు పైగా ఫీజు తీసుకుంటాడని సమాచారం. అయితే షారుఖ్ కూడా అప్పుడప్పుడు డబ్బు, రివార్డుల కంటే కళకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఇందులో భాగంగానే చాలా సినిమాలు ఎటువంటి ఫీజు తీసుకోకుండా నటించాడు. ఇక షారుఖ్ ఫ్రీగా నటించిన సినిమాలు చూసుకుంటే.. కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన హే రామ్() సినిమాతో పాటు ఆర్.మాధవన్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్, భూత్నాథ్, క్రేజీ 4, దుల్హా మిల్ గయా వంటి సినిమాలలో ఫ్రీగా నటించాడు.
దీపికా పదుకొనే
Deepika Paudkone
నటి దీపికా పదుకొణే ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరు. రీసెంట్గా కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ భామ. అయితే దీపికా నటించిన మొదటి సినిమాకు అసలు పారితోషికం తీసుకోలేదు. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో ఫరా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఓం శాంతి ఓం (2007) ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటించగా.. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో మెరిశాడు. 2007లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించి దీపికా ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదంటా.. షారూక్‌తో కలిసి పనిచేయడం ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం కావడం కంటే ఇంకా పెద్ద పారితోషికం ఏముందని రెమ్యూనరేషన్‌ను రిజెక్ట్ చేసింది ఈ భామ.
షాహిద్ కపూర్
Shahid Kapoor
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం హైదర్. షేక్స్పియర్ హామ్లెట్ నవళ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించగా.. టబు, కేకే మీనన్, ఇర్ఫాన్ ఖాన్, శ్రద్ధా కపూర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. రూ. కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో పాటు సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంకు షాహిద్ అసలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించాడు.
సల్మాన్ ఖాన్
Salman Khan
బాలీవుడ్ స్టార్ హీరోలలో కండల్ వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. సల్మాన్ ఖాన్ పారితోషికం తీసుకోకుండా ఒక సినిమాలో నటించాడు. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ. ఈ సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. దీనికోసం ఎటువంటి పారితోషికం తీసుకోకుండా నటించాడు సల్లూ.
నవాజుద్దీన్ సిద్ధిఖీ
Nawazuddin Siddiqui
బాలీవుడ్లో భారీ పారితోషికం అందుకునే నటులలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ కూడా ఉంటాడు. ఒక్కో సినిమాకు కనీసం 5 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటాడు ఈయన. అలాంటి నటుడు ఒక సినిమాకు ఒక్క రూపాయి మాత్రమే పారితోషికం అందుకున్నాడు. నందితా దాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మాంటో(Manto). దిగ్గజ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మాంటో జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మాంటో పాత్రలో నటించాడు. అయితే ఈ పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎటువంటి ఫీజు తీసుకోలేదు. ఇతనే కాదు ఈ చిత్రంలో నటించిన రిషి కపూర్, రన్వీర్ షోరే, జావేద్ అక్తర్, పరేష్ రావల్, దివ్యా దత్త లాంటి స్టార్స్ కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండా నటించారు.
సోనమ్ కపూర్
Sonam Kapoor
దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా భాగ్ మిల్కా భాగ్(Bhaag Milkha Bhaag). ఈ సినిమాలో మిల్కా సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించగా.. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో సోనమ్ కపూర్ నటించిన విషయం తెలిసిందే. బీరో అనే పాత్రలో నటించింది. అయితే ఈ పాత్ర కోసం సోనమ్ కపూర్ 11 రూపాయలు మాత్రమే పారితోషికం తీసుకుంది.