Naga Vamsi | టాలీవుడ్లో బడా నిర్మాతల్లో సూర్యదేవర నాగ శంశీ ఒకరు. అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంటారు. పలు ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్ బారినపడుతుంటారు. గత కొద్దిరోజుల కిందట బాలీవుడ్ టెలివిజన్ నిర్వహించిన ఇయర్ ఎండింగ్ రౌండ్ టేబుల్ డిస్కషన్లో ఈ నిర్మాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వార్తలకెక్కారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 మూవీ బాలీవుడ్లో సింగిల్ డేలోనే రూ.80కోట్లకుపైగా కలెక్షన్ చేసింది. దీన్ని గుర్తు చేస్తూ పుష్ప-2 కలెక్షన్‌తో బాలీవుడ్లో చాలా ప్రముఖలకు ఆ రోజు నిద్రపట్టలేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ ఆనంద్, సంజయ్ గుప్తా, హన్సల్ మెహతతో పాటు పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు నాగవంశీపై విమర్శలు గుర్పించారు. తాజాగా యువ దర్శకుడిపై మరోసారి సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రాన్ని నాగ వంశీ నార్త్‌లోనూ రిలీజ్ చేశారు. ఈ మూవీ నాలుగు రోజుల్లో కేవలం రూ.34లక్షల వరకు మాత్రమే కలెక్షన్‌ని మాత్రమే రాబట్టింది. పుష్ప-2 రిలీజ్ సందర్భంలో చేసిన కామెంట్స్‌పై సెటైర్లు వేస్తూ.. నాగ వంశీకి తన సినిమా కలెక్షన్ చూస్తే నిజంగానే నిద్రపట్టదు.. స్లీప్‌లెస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు నాగ వంశీ డాకు మహారాజ్ ఉత్తరాదిలో బాగా నడుస్తుందని ఆశించారు. కానీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నార్త్‌లో డాకు మహారాజ్ జనవరి 24న విడుదలైంది. అయితే, కథలో చాలా భాగాన్ని నార్త్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. 1980లో దాదాపు దశాబ్దన్నర పాటు పోలీసులు, రాజకీయ నాయకుల్ని ముప్పుతిప్పలు పెట్టిన మాన్ సింగ్ (డాకు సింగ్)బయోగ్రఫీని రిఫరెన్స్‌గా తీసుకొని.. తీసుకొని.. సినిమాను థియేటర్లో విడుదల చేశారు. అక్కడ జనాలకు కనెక్ట్ అవుతుందని భావించగా.. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.