ఇప్పుడు దక్షిణాది హవా నడుస్తున్నది. సౌత్ సూపర్‌హిట్స్‌ను హిందీలో రీమేక్ చేసి గల్లాపెట్టె నింపుకొందాం అనుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు. కానీ ప్రేక్షకులకు ఆ వ్యవహారం నచ్చలేదు. దీనికి కారణాలు మళ్లీ ఓటీటీ చుట్టే తిరుగుతాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఘన విజయాలు సాధించిన సినిమాలన్నీ ఒకట్రెండు నెలల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చేస్తున్నాయి. ఉత్తరాది సినిమా ప్రియులూ చూసేస్తున్నారు. అవే మళ్లీ ఫ్రేమ్ టు ఫ్రేమ్..సేమ్ టు సేమ్.. హిందీలో వచ్చేసరికి పెదవి విరిచేస్తున్నారు. దీంతో బాలీవుడ్ వ్యూహం మార్చుకుంది. చాలామంది నిర్మాతలు సూపర్‌హిట్ కాని.. మంచి సినిమాల మీద దృష్టి పెడుతున్నారు.
హక్కులు కొని రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదో చవకైన మార్గం కూడా. పెద్దపెద్ద సినిమాల రీమేక్ హక్కులు ఇప్పుడు ఏకంగా ఐదారు కోట్లు పలుకుతున్నాయి. అదే, కలెక్షన్ల రికార్డులేని సినిమాలైతే చవకగా కొనేయవచ్చు. ఈ ఫార్ములా ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.