Housefull 5 OTT | బాలీవుడ్లో నవ్వుల జాతర సృష్టించిన ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీ నుంచి ఇటీవల మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా.. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించాడు. నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం జూన్ 06న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.