ముంబై : టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్యం సాధించిన మీరాబాయి చానుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎందరో సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. అయితే బుధవారం నాడు ఆమెను కలిసిన ఓ నటుడి కారణంగా.. మీరాబాయి చాను ఎగిరి గంతేసిందంట. ఆ హీరోను కలువడంతో తన కల నెరవేరిందని ఎంతో సంతోషం వ్యక్తం చేసింది మీరాబాయి చాను.
ఒలింపిక్స్ కాంస్య పతక రాణి మీరాబాయి చానును ఎందరో అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఈ వరుసలో బుధవారం తనను కలిసి అభినందించేందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ రావడంతో మీరాబాయి ఆనందానికి హద్దులు లేవంట. తన అభిమాన నటుడు తనను అభినందించేందుకు రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేసింది మీరాబాయి. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించినందుకు మీరాబాయి చానును సల్మాన్‌ఖాన్ సత్కరించారు. నీ కష్టానికి ఫలితం దక్కింది. కాంస్యం గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్ను కలువడం నాకెంతో ఇష్టం. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి’ అని మీరాబాయితో అన్ని సల్మాన్‌ఖాన్.. అదే విషయాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ రాశారు.
ఈ సందర్భంగా తనను అభినందించేందుకు వచ్చిన సల్మాన్‌ఖాన్‌ను సాంప్రదాయక కండువాతో మీరాబాయి చాను సత్కరించారు. అనంతరం ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది. ‘నేను ఎంతగానే అభిమానించే కథానాయకుడు సల్మాన్‌ఖాన్ తనను అభినందించేందుకు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ను. ఆయన రాకతో ఆయనను కలవాలన్న నా కోరిక నెరవేరింది. ఆయన కండల శరీరం అంటే నాకెంతో అభిమానం’ అని చాను రాసింది. గతంలో చాలాసార్లు కూడా సల్మాన్ ఖాన్ అంతే తనకెంతో అభిమానమని మీరాబాయి చాను తెలిపింది. కాగా, సల్మాన్ కన్నా ముందు మీరాబాయి చానును క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సచిన్ ఆమెతో అన్నారు.
Equally happy to meet you this morning, @mirabai_chanu! 🙂
— Sachin Tendulkar (@sachin_rt) August 11, 2021
It was wonderful talking to you about your inspiring journey from Manipur to Tokyo.
You've got places to go in the coming years, keep working hard. https://t.co/YH4ta0cVY0
ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పైకి బుమ్రా.. కిందికి కోహ్లీ
కూరగాయలను సబ్బుతో కడుగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి..
ఇవి ఎకో ఫ్రెండ్లీ బూట్లు.. ఉత్పత్తి ఎక్కడో తెలుసా..?
డయాబెటిస్‌ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..