సినిమా ఇండస్ట్రీలో డబ్బు విషయంలో స్మార్ట్‌గా ఉండటం చాలా ముఖ్యమని అయితే తాను ఈ విషయంలో వెనకబడి ఉంటానని చెప్పారు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఈ లెక్కలు చూసుకునేందుకు తనకు ఓ టీమ్ ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం రణ్వీర్ ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఆలియా భట్ అతనికి జోడిగా కనిపించనుంది.
ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ…‘చిన్నప్పటి నుంచి నాది ఆర్టిస్టిక్ బ్రెయిన్. నటన, పాడటం, డ్యాన్సులు వంటి టాలెంట్ ఎక్కువగా ఉండేది. నేనూ వాటినే ఇష్టపడేవాడిని. నా బుర్రలో డబ్బు లెక్కలు, మేనేజ్మెంట్ స్కిల్స్ తక్కువ. ఇండస్ట్రీకి వచ్చాక బిజినెస్ పరంగా స్మార్ట్‌గా ఉండాలని తెలుసుకున్నా. అయితే నా వల్ల కాని ఈ విషయాలను డీల్ చేసేందుకు ఒక ప్రత్యేక టీమ్ ఉంటుంది. నా లెక్కల విషయాలన్నీ వాళ్లు చూసుకుంటారు’ అని చెప్పాడు.