యష్‌చోప్రా సతీమణి పమేలా చోప్రా కన్నుమూత
ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకనిర్మాత దివంగత యష్ చోప్రా సతీమణి పమేలా చోప్రా (74) గురువారం ముంబయిలో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్థానంలో భర్త యష్చోప్రాతో పాటు పమేలా చోప్రా కీలక భూమిక పోషించారు.
ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకనిర్మాత దివంగత యష్ చోప్రా సతీమణి పమేలా చోప్రా (74) గురువారం ముంబయిలో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్థానంలో భర్త యష్చోప్రాతో పాటు పమేలా చోప్రా కీలక భూమిక పోషించారు. కేవలం కుటుంబ బాధ్యతలకు మాత్రమే పరిమితం కాకుండా నేపథ్యగాయనిగా, రచయితగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పమేలా చోప్రా పేరు తెచ్చుకుంది.
యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన పలు చిత్రాల్లో ఆమె పాటలు పాడింది. సినిమాల స్క్రిప్ట్ రచనలో కూడా పాలుపంచుకుంది. ప్రస్తుతం ఆమె కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్‌చోప్రా యష్‌రాజ్ ఫిల్మ్స్‌కు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. పమేలా చోప్రా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అగ్ర హీరోలు షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, హృతిక్‌రోషన్ తదితరులు ముంబయిలోని నిర్మాత ఆదిత్యచోప్రా గృహానికి చేరుకొని పమేలా చోప్రా పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

