Yami gautam | ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ’గా పేరు సంపాదించుకుని.. వెండితెర అవకాశాలు దక్కించుకున్న ఉత్తరాది భామ.. యామి గౌతమ్. ప్రకటనలతో సాధించిన క్రేజ్‌తో సీరియల్స్‌తోపాటు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉంటే.. పెండ్లి తర్వాత కూడా కెరీర్లో దూసుకుపోవచ్చు అంటూ ఈ అందాల భామ చెబుతున్న కబుర్లు..
పెండ్లి తర్వాత హీరోయిన్ కెరీర్ ముగిసిపోయినట్టే అనుకుంటే పొరపాటే. కెరీర్‌కు వివాహం అడ్డంకి కాదని చాలామంది హీరోయిన్లు నిరూపించారు. మూడుముళ్ల తరువాత కూడా అనేక సినిమాల్లో నటిస్తున్నారు. అయితే, ఏడడుగులు వేశాక, బాధ్యత మరింత పెరుగుతుందనేది వాస్తవం. వివాహబంధంలో అడుగుపెట్టిన ప్రతి మహిళ జీవితంలో జరిగేదే ఇది.
వివాహితకు జీవిత భాగస్వామి ప్రోత్సాహం తోడైతే రెండింతల ఉత్సాహం వస్తుంది. సమాజాన్ని తట్టుకునే బలం చేకూరుతుంది. నా భర్త ఆదిత్య ధర్ కూడా సినిమా పరిశ్రమకు చెందినవాడే కావడం నాకు కలిసొచ్చిన విషయం. వృత్తి జీవితంలో నా సవాళ్లు ఏమిటన్నది ఒక రచయిత, దర్శకుడిగా ఆయనకు తెలుసు. అందుకే వరుస ప్రాజెక్టుల్లో పని చేయగలుగుతున్నా.
పాన్ ఇండియా పేరుతో పరిశ్రమలన్నీ ఒకేతాటిపైకి రావడం సంతోషకర పరిణామం. ఇది నటీనటులతోపాటు అభిమానులకూ కలిసొస్తుంది. నచ్చిన భాషలో, మెచ్చిన తారల చిత్రాలు ఆస్వాదించవచ్చు. పుట్టింది హిమాచల్‌లోనే అయినా కన్నడ పరిశ్రమ నన్ను నటిగా పరిచయం చేసింది. హిందీతోపాటు తెలుగు, మలయాళ, తమిళ సినిమాల్లో నటించాను. కథ, పాత్ర గురించి తప్పితే.. ఇంకేదీ పట్టించుకోను. ఒక ప్రేక్షకురాలి స్థానంలో కూర్చుని కథలు వింటాను. అప్పుడే అది జనానికి ఏమేరకు నచ్చుతుందో తూకమేసినట్టు చెప్పవచ్చు.
తెలుగులో చేసినది నాలుగు సినిమాలే అయినా టాలీవుడ్ ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. మంచి అవకాశం వస్తే మరిన్ని సినిమాల్లో నటిస్తా. నటనపై ఇష్టంతోనే మాడలింగ్లో అడుగు పెట్టాను. ప్రకటనల ద్వారా అభిమానులను సంపాదించుకున్నాను.
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా కొనసాగుతున్నది. ఓటీటీ వేదికలవైపే ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. అందుకే ‘లాస్ట్’తో ఓటీటీలో పలకరిస్తున్నా. సోషల్ మీడియా ద్వారా నా సంగతులన్నీ అభిమానులతో పంచుకోడానికి ఇష్టపడతాను.